Home ఆంధ్రప్రదేశ్ మాచుపల్లి, కాజీపల్లి గ్రామాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మాచుపల్లి, కాజీపల్లి గ్రామాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 30

కడప జిల్లా సిద్దవటం మండలం
మాచుపల్లి, కాజీపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసింది. ఈ చెక్కులను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు మరియు కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్ప శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
ప్రజల కష్టసమయంలో అండగా నిలిచి తక్షణ సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీనివాస రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, సత్య చిట్ ఫండ్ MD బాలకృష్ణ రెడ్డి, మచుపల్లి ఓబుల్ రెడ్డి, కాజీపల్లి కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2,846 Views

You may also like

Leave a Comment