Home ఎంటర్‌టెయిన్మెంట్ బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంది! థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇదే – VRM MEDIA

బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంది! థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇదే – VRM MEDIA

by VRM Media
0 comments
బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంది! థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇదే



– బాహుబలి ది ఎపిక్ పబ్లిక్ టాక్
– ఓవర్ సీస్ టాక్ ఎలా ఉంది
– ప్రభాస్ ఫ్యాన్స్ హంగామ
– ఈవినింగ్ నుంచే బెనిఫిట్ షోస్

దాదాపు గంటల్లో ‘బాహుబలి ది ఎపిక్'(Baahubali The epic)థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రీ రిలీజ్ లాగా లేదు. ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్నట్టుగానే ఉంది. అక్టోబర్ 31 రిలీజ్ డేట్ అయినా ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీనితో థియేటర్స్ దగ్గర ప్రభాస్(ప్రభాస్),రానా(రానా) రాజమౌళి(రాజమౌళి)ఫ్యాన్స్ తో పాటు బాహుబలి(బాహుబలి)ఫ్యాన్స్ తో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 రిలీజైన రోజులతో పాటు వారి చిత్రాలకి వచ్చిన టాక్ ని కూడా గుర్తు చేసుకుంటున్నారు.

బాహుబలి పార్ట్ 1 2015 జులై 10 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెట్టింది. సిల్వర్ స్క్రీన్ పై ఒక కొత్త లోకం ప్రత్యక్షమవుతుండగా షూటింగ్ సమయం నుంచే అభిమానులతో పాటు ప్రేక్షకులు పార్ట్ 1 ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ వచ్చారు. దీనితో రోజు రిలీజ్ ఎన్నో అంచనాలతో థియేటర్స్ లోకి అడుగుపెట్టారు. వాళ్ళు ఊహించనట్టుగానే ప్రతి షాట్ కి మంత్రముగ్ధులయ్యారు. అభిమానులు, మూవీ లవర్స్ ఆనందం అయితే అంతా ఇంతా కాదు. థియేటర్స్ నుంచి బయటకొచ్చాక వాళ్ళు మాట్లాడటం మేము తెలుగు సినిమా ప్రేమికులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అని ముక్తకంఠంతో చెప్పారు. మూవీ బాగాలేదనే నెగిటివ్ టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అయ్యింది. ఆ న్యూస్ తో చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత స్లోగా సూపర్ డూపర్ హిట్ దిశగా దూసుకెళ్లింది.

ఇది కూడా చదవండి: బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కి అనుష్క డుమ్మా.. రెమ్యునరేషన్ ఎంత అడిగింది

ఇక రెండవ భాగం 2017 ఏప్రిల్ 28న విడుదల అయ్యింది. మొదటి భాగంలో ఉన్న అనేక ప్రశ్నలకి రెండవ భాగంలో సమాధానం రావడంతో పాటు, రాజుగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసాడు. కథనం కూడా వేగంగా నడవడంతో, బెనిఫిట్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులని కూడా తన ఖాతాలో భద్రపరుచుకుంది. ఈ నేపథ్యంలో రెండు భాగాలు ఒకే భాగంగా బాహుబలి ఎపిక్ గా వస్తుంది మరి ఎపిక్ టాక్ ఎలా వస్తుంది. హిట్టా, ప్లాపా, ఏవరేజ్ నా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఓవర్ సీస్ లో ఆల్రెడీ షోస్ పడ్డాయి. హిట్ టాక్ వచ్చింది.

2,804 Views

You may also like

Leave a Comment