దేవీపట్నం ప్రెస్ నోట్: VRM Media
మోధా తుఫాను ప్రభావంతో దేవీపట్నం మండలం లో పలు గ్రామాలు గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు, పొంగి కాలువల ద్వారా పలు గ్రామాల్లో రోడ్లపైకి నీరు రావడంతో ఉదయం నుంచి ఇందుకూరుపేట పలు గ్రామాలకు భారీ వర్షం కురుస్తుండడంతో ఇటు గోకవరం ఇందుకూరుపేట గ్రామమునకు దాదాపు 5 గంటల నుంచి రాకపోకల స్తంభించినాయి. ఈ తరుణంలో వెంటనే స్పందించిన రెవెన్యూ పోలీస్ పంచాయతీ అధికారులు కాలువలు వద్ద ప్రజలకు తగు జాగ్రత్తలు చెబుతూ నిలుపుదల చేయడం జరిగినది దీనిలో భాగంగానే వెలగపల్లి కచ్చులూరు తాటివాడ లక్ష్మీపురం హిందూకూరుపేట పెద్ద కాలువ గోపాలపురం వెళ్లే దారి గోకవరం కోళ్ల ఫారం వద్ద భారీగా పోలీస్ పికేటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది తెల్లవారుజామున కురిసిన భారీ వర్షమునకు భారీగా నీరు కాలువల పైకి రావడంతో ఉదయం నుంచి ఉద్యోగస్తులు విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లిపోవడం జరిగినది రంపచోడవరం సిఐ దేవీపట్నం ఎస్ఐ ప్రజలకు పలు జాగ్రత్తలు తెలిపారు కాలువలపై వచ్చే నీరు తగ్గేవరకు ప్రజలు గాని ద్విచక్ర వాహనాలు గాని నీరు తగ్గే వరకు వెళ్లవద్దని ప్రతి కాలువ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది అని ప్రజలు సహకరించవలెనని రంపచోడవరం సిఐ సన్యాసినాయుడు, దేవీపట్నం ఎస్సై కే షరీఫ్ తెలిపారు



అదేవిధంగా తహసిల్దార్ కే సత్యనారాయణ తమ రెవెన్యూ సిబ్బందిని కాలువలు వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు ఇందుకూరుపేట పంచాయతీ కార్యదర్శి ఎం సురేష్ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట పెద్దకాలు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటితో భారీ చెట్టు కొట్టుకు రావటంతో జెసిబి సహాయంతో తొలగించడం జరిగినది కాలువలు వద్ద సచివాలయం సిబ్బంది పలు జాగ్రత్తలు చెప్పడం జరిగినది అధికారులకు ప్రజలు సహకరించవలెనని తెలిపారు