



రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో మొంథా తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి పంటను పరిశీలించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు. వీరి వెంట ప్రభుత్వ అధికారులు, మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు..
VRM (మీడియా) ఐ .భద్రం
అనంతరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ మొంథా తుఫాన్ సంభవించిన నేపథ్యంలో ఎడతెరగని లేకుండా వానలు కురవడం వలన రైతాంగం పంట చేతికొచ్చిన సమయంలో రాజానగరం మండలంలో అకాల వర్షాల వల్ల పంట పొలాలు, ఉద్యాన పంటలు కొన్ని వేల ఎకరాల పంట నేలకొరగడం జరిగింది. రైతులందరికీ సంపూర్ణమైన హామీ ఇస్తూ, కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు భరోసాగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకొంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం ఎంపీడీఓ, MRO, వ్యవసాయ శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.