
 
						 
						

– ప్రేక్షకుల ముందుకు ‘బాహుబలి ది ఎపిక్’ 
– యూఎస్ ప్రీమియర్ టాక్ ఏంటి?
– వంద కోట్ల గ్రాస్ సాధ్యమేనా?
తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు రెండు భాగాలు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఒక సినిమాగా రీ-రిలీజ్ అవుతోంది. ఇండియాలో అక్టోబర్ 31న విడుదలవుతుండగా.. ఓవర్సీసీలో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. (బాహుబలి ది ఎపిక్)
బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు ఐదున్నర గంటల నిడివి. దానిని ఏకంగా 3 గంటల 45 నిమిషాలకు కుదించడంతో ‘బాహుబలి ఎపిక్’పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ.. యూఎస్ ప్రీమియర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇది రీ-రిలీజ్ లా లేదని ఒక కొత్త సినిమా ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.
ప్రభాస్-తమన్నా లవ్ సీన్స్, కొన్ని సాంగ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ ని ట్రిమ్ చేయడంతో.. సినిమా వేగంగా పరుగెత్తింది. అలా అని స్టోరీ సోల్ కానీ, ఎమోషన్ కానీ ఎక్కడా మిస్ అవ్వలేదు. ప్రేక్షకులను కథలో మరింత ఇన్వాల్వ్ చేయడం కోసం.. అక్కడ వాయిస్ ఓవర్ జోడించడం కూడా బాగుందని చెబుతున్నారు. ప్రధాన పాత్రల మధ్య డ్రామాని బిల్డ్ చేస్తూ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపిస్తూ.. ఎడిట్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.
ఇది కూడా చదవండి: అప్పుల్లో దర్శకధీరుడు రాజమౌళి..?
బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది. ఇప్పటికే చాలాసార్లు చూస్తుంటాం. అయినప్పటికీ ‘బాహుబలి ది ఎపిక్’ ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ, థ్రిల్ ని పంచుతుందని.. ఇది ఖచ్చితంగా మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఆస్వాదించాల్సిన చిత్రమని.. ప్రీమియర్స్ చూసిన వారంతా చెబుతుండటం విశేషం.
రీ-రిలీజ్‌లో రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన మొట్టమొదటి సినిమాగా ‘బాహుబలి’ ట్రేడ్ వర్గాల అంచనా. అసలే ప్రేక్షకులు ‘బాహుబలి ది ఎపిక్’ కోసం ఓ కొత్త సినిమాలా తయారయ్యారు. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు ఓవర్స్ ప్రీమియర్స్ టాక్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. వంద కోట్లు ఏంటి, అంతకుమించి వసూళ్ళు రాబట్టినా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది.
 
				 
														 
	