Home ఆంధ్రప్రదేశ్ నిర్వశితులని నిండా ముంచేసిన కాంట్రాక్టర్లు

నిర్వశితులని నిండా ముంచేసిన కాంట్రాక్టర్లు

by VRM Media
0 comments

నిర్వశితులని నిండా ముంచేసిన కాంట్రాక్టర్లు
👉ఇంజనీర్ ప్లాన్ వైఫల్యమా.
👉కాంట్రాక్టర్ వైఫల్యమా.

VRM Media

వరదను తలపిస్తున్న గోకవరం చివర గంగాలమ్మ తల్లి గుడి వద్ద దేవీపట్నం పునరావాస కాలనీ దుస్థితి..
2020 బ్యాక్ వాటర్ కారణంగా పునరావాసాలకు చేరుకున్న నిర్వశితులు కృష్ణునిపాలెం పునరావాస కాలనీల్లో గోకవరం చుట్టుప్రక్కల 3వేల నుంచి 5వేలవరకు అద్దెకు తీసుకుని కాలం వెళ్ళబుచ్చుతున్నారు…
👉నాటి నుంచి 2024వరకు వైసీపీ ప్రభుత్వలో సంవత్సరానికి ఒకరు చప్పున సబ్ కలెక్టర్ లు పి.వో లు స్పెషల్ కమిషనర్ లు మారుస్తూనే వున్నారు వచ్చిన ప్రతిఒక్క అధికారి నిర్వశితుల గోడును వినేవారు కాదు కాంట్రాక్టర్లు ఏది చెప్తే అదే విని నిర్వశితులకు చెప్పి వెళ్లిపోయావారు.
నాడు సరైన రీతిలో నిర్వశితులు ప్రధానంగా చెప్పుకున్న సమస్యలను పరిస్కరించి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు…
👉అలా అని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర కావస్తుంది అయితే మళ్ళీ టెండరింగ్ పెట్టి కాంట్రాక్టర్లు మారుస్తారు అని తెలిసిన వెంటనే కాంట్రాక్టర్లు కాలనీ పనులు చేయటం మానేశారు.
కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే వదిలేసి వున్నా పరిచయాలు ద్వారా బిల్లులు చేయించుకుని చేతులు దులుపుకున్నారు.
👉కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన కాంట్రాక్టర్లు ఏదో చేశామా అనే విధిగా చెయ్యటం వలన పునరావాస కాలనీకి ముందస్తుగా నిర్మించల్సిన సేఫ్టీ వాళ్ళు మరియు చుట్టూ నిర్మించాల్సిన డ్రైనేజి వ్యవస్థను నిర్మించక పోవటంతో నిశ్వశితుల దుస్థితి ఇలా ఉండిపోయింది ఒక విధంగా చెప్పాలి అంటే అటు వైసీపీ ప్రభుత్వం వున్నా ఇటు కూటమి ప్రభుత్వం వున్నా నిర్వశితుల పునరావాస కాలనీ మౌలిక సదుపాయాలు ఎర్పాటులో కానీ న్యాయం చెయ్యటంలో పూర్తిగా వైఫల్యం పొందారిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు…
👉తుఫాను కారణంగా వచ్చింది అంటే అది ముమ్మాటికీ తప్పే అవ్వుద్ధి చిన్నపాటి వర్షానికి కూడా ఆ దేవీపట్నం పునరావాస కాలనీ పరిస్థితి ఇలానే ఉంటుంది అంటూ కూటమి ఓటువేసిన నిర్వశితులు నాడు ఓటు వెయ్యండి అని గడప గడపకు వెళ్లి ప్రచారం చేసిన నాయకులను అడుగుతున్నారు అని దేవీపట్నం మండల జనసేనపార్టీ అధ్యక్షులు చారపు వెంకటరాయుడు తెలియజేశారు…
👉గోకవరం మండలంలో కల్పించిన 44 గ్రామాల నాన్ ట్రైబ్ తోయ్యేరు దేవీపట్నం గ్రామాల వోటింగ్ ని కొంతమంది ప్రయాజనాలసుకోసం పూర్తి వివరాలు సమాచారం ఇవ్వకుండా గోకవరం లో కలిపేసారు మిగిలిన 16గ్రామాలు వోటింగ్ రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోనే ఉన్నాయని.
👉గౌరవ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రు గారుని అలానే రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష దేవి గారుని ఇరు జిల్లాల కలెక్టర్ లతో చర్చించి పునరావాస కాలనీల దుస్థితికి కారణంగా మారిన కాంట్రాక్టర్లు పై కేసు నమోదు చేయించి నాటి ప్రభుత్వంలో మొట్టమొదటి సరిగా కాంట్రాక్ట్ టెండరింగ్ లో ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ లో వున్నా విధంగా ఇచ్చిన కొటేషన్ ద్వారా మౌలిక సదుపాయాలు ఏమార్చారో అవన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సమస్యపై త్వరలోనే ఇరు ఎమ్మెల్యే లను కలిసి వివరిస్తానని అలానే జనసేనపార్టీ అధ్యక్షులు డిప్యుటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ద్రుష్టికి అలానే కూటమి పెద్దలను కలుస్తానని తెలియచేస్తున్నాను.
మీ చారపు వెంకటరాయుడు
దేవుపట్నం మండల జనసేనపార్టీ అధ్యక్షుడు

2,827 Views

You may also like

Leave a Comment