


నిత్యావసర సరుకుల, ఆర్థిక సహాయం అందించిన మురళీరాజు..
ప్రత్తిపాడు.. వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 31:–
ముంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఒమ్మంగి గ్రామంలో ఇళ్లు కూలి నిరాశ్రయులైన పలు కుటుంబాలను నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు వైసిపి నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పరామర్శించారు.
ముంతా తుఫాను కారణంగా ఒమ్మంగి గ్రామంలో ఇల్లు కోల్పోయిన మూడు కుటుంబాలను ఆయన పలరించారు,గ్రామానికి చెందిన గోపు,కాపు,బాబ్జి కి చెందిన పెంకుటిల్లు కూలిననేపథ్యంలో ఆ
కుటుంభానికి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం తోపాటు 25 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులను మురళీ రాజు అందించారు.
ఇదే గ్రామానికి చెందిన చుక్కల తాతారావు కి చెందిన పెకుటిల్లు కూలడతో దానిని పరిశీలించారు, వారికి బియ్యం, నిత్యావసర సరుకుల, తో 5 వేలు రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
ఇటీవల కాలుకి గాయమై మంచాన పడ్డ షేక్ సత్తిబాబు ను పరామర్శించారు.ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ముదునూరి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ .తుఫాను కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.చేతికొచ్చిన పంట నేల పాలవ్వడంతో అభాగ్యులైన రైతులను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
కూటమి ప్రభుత్వం ప్రచారానికి పరిమితం కాకుండా బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముదునూరి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోప్రత్తిపాడు ఎంపీపీ గొళ్ల సుధాకర్,సీద్రపు భాస్కరరావు, నానిపల్లి చంటి,గటా గంగబాబు,కోలా తాతబాబు బోలు నాగేశ్వరరావు,తోలేటి శేఖర్,గంట లచ్చబాబు,నార్లంక వెంకన్నబాబు,ముమ్మిడి వీరబాబు,మిత్తన వీరబాబు, దారా నూకరాజు,సుంకర తమ్మారావు,గంట చిట్టిబాబు,ముద్దా జోగారావు
,సుంకర దొంగయ్య,నూకల తాతబాబు గారు,కూరాడ వీరబాబు ,షేక్ సత్తిబాబు ,పోలుమతి చిన్ని పలువురు మురళి రాజు. అభిమానులు పాల్గొన్నారు