వి ఆర్ ఎం మీడియా న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లోని కాశిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏక్తా దివస్ ను పురస్కరించుకొని ఈ సందర్భంగా 2 కె రన్ ను నిర్వహించడం జరిగింది ఈ 2కె రన్ సోమ గూడెం శిశు మందిర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై దుబ్బగూడెం ఓల్డ్ టోల్గేట్ వరకు నిర్వహించడం జరిగింది 2కె రన్ నిర్వహణలో భాగంగా క్రీడాకారులు యువకులు ప్రజాప్రతినిధులు పోలీసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి అందించిన సేవలను క్రీడాకారులకు యువకులకు పాల్గొన్న ప్రజలకు వివరించారు