VRM Media
రంపచోడవరం నియోజకవర్గం
శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష దేవి గారికి మరియూ గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్
దేవీపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటరాయుడు మాట్లాడుతూ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు మండలాల్లో దేవీపట్నం మండలం కూడా ప్రధానమైన మండలం అయితే సుమారు 44 గ్రామాల్లో గల గిరిజన మరియు గిరిజన ఇతరులను పునరావాస కేంద్రాలకు గత వైసీపీ ప్రభుత్వం లో బ్యాక్ వాటర్ కారణంగా బలవంతంగా రావాల్సి వచ్చింది అయితే గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గం కృష్ణుడు పాలెం పంచాయితీ పునరావాస కాలనిలో గిరిజనతరులు సుమారు ఆరు పంచాయితీల వారు వచ్చియున్నారు ఈ కాలనీ నుంచి చదువుకోవటానికి కాలనీ నుంచి జూనియర్ కళాశాలకు సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది విద్యార్థి విద్యార్చులు నడుచుకుని వెళ్లి వస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలానే దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట చుట్టుపక్కల గిరిజనులకు పునరావాస కాలనీలను నిర్మించారు అయితే పాఠశాలకు మరియు కళాశాలకు నాలుగు నుంచి ఏడు కిలోమీటర్లు నడుచుకుని లేదా లిఫ్ట్ లమీద వస్తున్నారు అని మీకు తెలియచేయునది అలానే రంపచోడవరం నియోజకవర్గ గిరిజన గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు దూరన్ని బట్టి గతంలో టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను ఇవ్వటం జరిగింది కాలం గడిచేకొద్ది ఆ పద్దతిని పక్కన పెట్టేసారు కాబట్టి దేవీపట్నం మండలంలో గల గిరిజన మరియు గిరిజనేతర విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ద్వారా సైకిళ్లను పంపిణి చేయవలసినదిగా మర్యాదపూర్వకంగా మిమ్ములను కోరుకుంటున్నాము అని తెలియచేసారు.. ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు కర్రి మహేష్ నాయుడు,ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, సీనియర్ నాయకులు మట్టా సందీప్ నాయుడు, ఐనవిల్లి భద్రం,కోండ్ల సురేష్ రెడ్డి,పి.న్మూర్తి,తాటి రాజేష్,కుంజ చింటూ,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

