

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 31
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి 11వ పోలీస్ పటాలయం కమాండెంట్ కె ఆనంద రెడ్డి తెలిపారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బెటాలియన్ లోని కళ్యాణమండపము నందు బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు కార్యక్రమానికి, డాక్టర్ నవీద్ అహ్మద్ డాక్టర్ రామనాథం డాక్టర్ జయ ప్రకాష్ డాక్టర్ ప్రబంజ ప్రభంజన్ డాక్టర్ శ్రావిక హాజరు అయ్యి వారియొక్క సేవలను అందించారు మెడికల్ క్యాంపు నందు దాదాపు 273 మంది వరకు ఆఫీసర్స్, మెన్ యొక్క కుటుంబ సభ్యులు మరియు బెటాలియన్ చుట్టూ పక్కల గామ ప్రజలకి చిన్నపిల్లకు, వృద్ధులకు మరియు వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలుచేసి ఉచిత మందులు పంపిణి చేసారు అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది 19 మంది బ్లడ్ ఇవ్వటం జరిగినది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ డి.ఎస్.పి శ్రీ కె వెంకట రెడ్డి యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి దివ్య రాణి ఆర్ఐ లు ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐ లు మరియు సిబ్బంది యూనిట్ హాస్పిటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు