

సిద్దవటం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 31
మండలంలోని మాధవరం-1 పరిధి పార్వతీపురం లోని చేనేత కార్మికుల మగ్గం గుంతలను శుక్రవారం జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాలరామయ్య పరిశీలించారు. బాధితుల వినతి మేరకు చేనేత కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో సామాగ్రి దెబ్బతినడమే కాకుండా కూలి పనులు కూడా నిలిచిపోయాయన్నారు. ఈ కారణంతో కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి చేనేత కార్మికులను ఆదుకునే దిశగా చర్యలు చేపడతామని రామయ్య తెలిపారు.