Home ఆంధ్రప్రదేశ్ శరభవరం లో ముద్రగడ గిరిబాబు పర్యటన

శరభవరం లో ముద్రగడ గిరిబాబు పర్యటన

by VRM Media
0 comments

ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 9

ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామంలో గురువారం వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించారు. గ్రామ మాజీ సర్పంచ్ అటికే సత్యవతి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గిరిబాబు మాట్లాడుతూ సర్పంచ్ సత్యవతి మృతి గ్రామానికి తీరని లోటు అని సర్పంచ్ గా గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రామి శెట్టి నాని, రామిశెట్టి దొరబాబు, అమరాధికాశి, గువేరా, రంగనాథం అబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

2,836 Views

You may also like

Leave a Comment