
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 1
సిద్ధవటం మండలం ఉదయం జరగబోయే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి అని పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్త, పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు అందరూ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.
ఈ సందర్బంగా ఈరోజు ఉదయం పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వెల్ఫేర్ అధికారిణి శ్రీమతి ఉప్పు శారదా గార్లు కలిసి ఖాజీపల్లి వాసి పెన్షనర్ నిమ్మకాయల లక్ష్మీ దేవి గృహం వద్ద ప్రత్యక్షంగా పెన్షన్ పంపిణీ చేశారు.
ఉదయం కోడి కూయకముందే విధులకు హాజరై, ప్రతి నెలా ఒకటో తేదీన నిబద్ధతతో పెన్షన్ పంపిణీ చేస్తున్న సచివాలయం సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి వృద్ధుడు, వితంతువు, వికలాంగుడు, నిరుపేద కుటుంబాలకు మద్దతు అందించాలనే లక్ష్యంతో సీఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఈ సందర్భంగా నాగముని రెడ్డి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.