
– కల్కి2లో మరో పాన్ ఇండియా హీరోయిన్
– వైజయంతీ మూవీస్‌పై విమర్శలు
– కల్కి2 పనులు మొదలయ్యాయి
సినీ పరిశ్రమలో కొందరు నటినటులను ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి వారిలో దీపికా పదుకొనే ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమధ్య కల్కి2 చిత్రానికి సంబంధించిన వివాదం. పారితోషికం పెంచాలని, పని గంటలు తగ్గించాలని దీపిక చేసిన డిమాండ్స్ వల్ల వివాదం మొదలైంది. దీంతో ఆమె కల్కి2 చిత్రం నుంచి తప్పుకుంది. ఈ ప్రదర్శన వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కల్కి’ అని ఎండ్ టైటిల్స్‌లో దీపిక పేరును తొలగించారన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కల్కి టీం ఇలా చేయడం సరికాదని నెటిజన్లు, అభిమానులు విమర్శిస్తున్నారు. అతి పెద్ద సంస్థ అయిన వైజయంతీ మూవీస్ ఇలాంటి చర్యలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇది చిన్న పిల్లల చర్యలని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతుండగానే మరోసారి ఓటీలో స్ట్రీమ్ అవుతున్న కల్కి కొందరు ప్రముఖులు చూశారు. అయితే ఎండ్ టైటిల్స్‌లో దీపిక పేరు యధాతథంగా ఉందని పేర్కొన్నారు.
Also Read: బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!
దీన్నిబట్టి మొదట ఆమె పేరును తొలగించి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను చూసిన తర్వాత మళ్లీ యాడ్ చేసి ఉంటారని అంతా చెప్పారు. ఏది ఏమైనా ఒక పెద్ద నిర్మాణ సంస్థ వ్యవహరిం చాల్సిన తీరు ఇది కాదని కామెంట్స్ పెడుతున్నారు. కల్కి నుంచి తప్పుకున్న దీపిక స్పిరిట్ చిత్రం నుంచి కూడా వైదొలగినట్టు కనిపిస్తోంది. తన కుమార్తె కోసం తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు దీపిక చెబుతోంది. ప్రస్తుతం షారూక్ ఖాన్ హీరోగా రూపొందుతున్న కింగ్ చిత్రంలోనూ, అల్లు అర్జున్ హీరోగా నటించే ఓ సినిమాలో దీపిక నటించనుంది.
ఇది కూడా చదవండి: https: మాస్ జాతర మూవీ రివ్యూ
ఇక ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. త్వరలోనే సందీప్‌రెడ్డి వంగా స్పిరిట్ స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత కల్కి2 సినిమా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీప్రడక్షన్ వర్క్ జరుగుతోంది. దీపిక స్థానంలో మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిన హీరోయిన్‌కే ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తారని సమాచారం. అయితే ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పట్లో దానికి సంబంధించిన ఏ సమాచారం బయటకు రాకపోవచ్చు.