[ad_1]

- బాహుబలి ది ఎపిక్ రికార్డు కలెక్షన్స్
-ప్రేక్షకులని కలిసిన రాజమౌళి
-ఒకే భాగంగా చూసి మెస్మరైజ్
బాహుబలి ది ఎపిక్(Baahubali The Epic)వరల్డ్ వైడ్ గా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. అభిమానులు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. సిల్వర్ స్క్రీన్ పై రెండు భాగాలుగా మ్యాజిక్ చేసిన బాహుబలిని ఒకే పార్ట్ గా చూసిన ప్రేక్షకులు ఎంతగానో మెస్మరైజ్ అయ్యారు. దర్శకుడు రాజమౌళి ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి వాళ్ళల్లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఇక ఈ మూవీ తొలి రోజు ఎంత కలెక్షన్స్ రాబట్టిందనే ఆసక్తి అందరిలో ఉంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో 10 .4 కోట్ల రూపాయలు, నార్త్‌లో 1 .50 కోట్లు, ఓవర్ సీస్లో 3 .5 కోట్లతో సుమారు 14 .59 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ వ్యక్తం చేస్తున్నాయి. పది సంవత్సరాల తర్వాత కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం ఒక రికార్డు అని చెప్పవచ్చు. వీకెండ్ లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: మాస్ జాతర రివ్యూ
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird