Home ఆంధ్రప్రదేశ్ గొడే హరీష్ చేసిన సేవలను గుర్తించి ఘనంగా సన్మానించిన పత్రి రమణ,గోకవరపు వీధి సభ్యులు

గొడే హరీష్ చేసిన సేవలను గుర్తించి ఘనంగా సన్మానించిన పత్రి రమణ,గోకవరపు వీధి సభ్యులు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ నవంబర్ 2:–

హిందూ ధర్మాన్ని పెంపొదించడానికి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధారాళంగా విరాళాలు ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గొడే హరీష్ పలువురికి ఆదర్శ ప్రాయుడని గురుభవాని పత్రి రమణ అన్నారు.కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన జిబిఆర్ రియల్ ఎస్టేట్ అధినేత గోడే హరీష్ అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రత్తిపాడులో ఉన్న గోకవరపు వీధి యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి, నవంబర్ 3,సోమవారం జరగబోయే కోటి దీపోత్సవం కార్యక్రమానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చిన సందర్భంగా హరీష్ ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా పత్రి రమణ మాట్లాడుతూ పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే గుడి హరీష్ లాంటి మంచి వ్యక్తి పది కాలాలపాటు చల్లగా ఉండేలా ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు

2,809 Views

You may also like

Leave a Comment