
ఏలేశ్వరం, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్
నవంబర్ 2:–
పట్టణంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం,అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య,బొద్దిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి హాజరయ్యారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి రోజునే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని,పొట్టి శ్రీరాములు సుమారు50 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వచ్చిన మహానుభావుడని కొనియాడారు.అనంతరం గొల్లపూడి త్రిమూర్తులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్,చిక్కాల లక్ష్మణరావు,వాగు కామేశ్వరరావు,గ్రంధి కృష్ణ,రత్నాజీ, గొల్లపూడి సత్యనారాయణ,జి. సత్తిబాబు,మువ్వ మూర్తి,జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.