కల్లూరు మండల పరిధిలోని ఇటీవల మొoథ తుఫాను వలన మండలంలో చంద్రుపట్ల, లింగాల, ఎర్రబోయినపల్లి, పాయపూరు, ముచ్చవారం,పలు గ్రామాలలో కోత వచ్చిన వరి పంటలు విపరీతమైన గాలి వల్ల నేలమట్టం అయినది చేతికొచ్చిన పంట నేలమట్టం అవటంతో రైతులు దిక్కు తోచని స్థితిలో అయోమయంలో పడ్డారు ఈ విషయంపై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు సమాచారం తెలియజేయడం జరిగింది దీనిపై ప్రభుత్వము వెంటనే స్పందించి రైతులకు పంట నష్టం పై సర్వే నిర్వహించి రైతులకు సరైన న్యాయం చేయాలని గ్రామాలలో రైతులు మీడియాని కోరడం జరిగింది.