

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి ‘వారణాసి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘వారణాసి’ టైటిల్ తో తెలుగులో ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి ఓ స్టార్ హీరో, డైరెక్టర్ పని చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
సనాతన ధర్మం గొప్పదనాన్ని సూచించూ రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ‘రఫ్’ దర్శకుడు సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. త్వరలోనే గ్రాండ్ లాంచ్ తో ఈ మూవీని ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ప్రశాంత్ వర్మ బ్యాడ్ టైం.. ఆగిపోయిన ప్రభాస్ ప్రాజెక్ట్..!
ఇటీవల విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సనాతన ధర్మం ఎంత గొప్పదో సూచించూ కమర్షియల్ ఎలిస్‌తో ఈ వస్తువును రూపొందించారు. ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటిస్తుండగా, ఓ స్టార్ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే అందించారు. దీంతో ఆ స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరనే చర్చ జరుగుతోంది.
భారతదేశంలోని అతి పవిత్ర ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే షూటింగ్ మొత్తం జరుగుతుందని దర్శకుడు సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటినటుల వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తామని రామభక్త హనుమ క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది.