
.webp)
-రష్మిక సంచలన వ్యాఖ్యలు
-ది గర్ల్ ఫ్రెండ్ పై భారీ అంచనాలు
-వాళ్ళ పేర్లు చెప్తే చంపేస్తారు
-విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ అయ్యిందా!
సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ పాన్ ఇండియా నటిగా చెలామణి అవుతుంది రష్మిక(రష్మిక మందన్న).. తను కన్నడ భామ అనే విషయం మర్చిపోయి, రష్మిక తమ ఇండస్ట్రీ కి చెందిన నటి అని మేకర్స్, ప్రేక్షకులు సగర్వంగా చెబుతున్నారు. దీన్నిబట్టి రష్మిక ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 7న మరోమారు సిల్వర్ స్క్రీన్ పై తన హవాని చాటడానికి ‘ది గర్ల్ ఫ్రెండ్'(ది గర్ల్ ఫ్రెండ్)అనే మూవీతో రాబోతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో చిత్ర విజయంపై రష్మిక అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తూ ఉంది. రీసెంట్‌గా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తే ఒక అభిమాని రష్మికతో ‘మీ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్’ ఎవరు అనే ప్రశ్న సంధించడం జరిగింది. స్పందించిన రష్మిక ‘నా కంటూ కొంత మంది బెస్టిస్ ఉన్నారు. పబ్లిక్ లో వాళ్ళ పేర్లు చెబితే చంపేస్తారు అంటూ సమాధానం చెప్పింది. ఇప్పుడు రష్మిక చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు, పేరు చెప్తే చంపేస్తే అంతా బెస్టిస్ ఎవరని అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈమె మన శివగామినేనా! అంతా రామ్ గోపాల్ వర్మ మాయ
రష్మిక కి ఇటీవల సహ నటుడు విజయ్ దేవరకొండ(Vijay deverakonda)తో ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరు ఒక ఇంటివాళ్ళు కాబోతున్నారని అభిమానులు సంబరాలలో మునిగిపోయారు. కానీ ఈ విషయాన్నీ రష్మిక, విజయ్ అధికారకంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అనడంలో ఎలాంటి అతిశయో లేదు. రష్మిక తో పాటు చిత్ర బృందం గర్ల్ ఫ్రెండ్ విజయంపై పూర్తి నమ్మకంతో ఉంది.
