Home ఆంధ్రప్రదేశ్ నిత్య పూజ కోనకు భక్తుల lతాకిడిపటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన సిఐ బాబు

నిత్య పూజ కోనకు భక్తుల lతాకిడిపటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన సిఐ బాబు

by VRM Media
0 comments

సిద్ధవటం, VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 03

లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజ్యేశ్వర కోనకు భక్తుల రద్దీ పెరగడంతో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ బాబు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మండలంలోని వంతాటిపల్లి గ్రామం లంకమల అభయా రణ్యం లో వెలసిన శ్రీ నిత్య పూజేశ్వర కోనకు కార్తిక రెండవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరగడంతో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు నేతృతంలో ఎస్ఐ, సుబ్బరామచంద్ర, హెడ్ కానిస్టేబుల్ రమణ,, స్థానిక పోలీసులు, రామ్ కుమార్, శివ, బందోబస్తులో పాల్గొన్నారు మార్గమధ్యంలో వర్షాకాలం వల్ల రహదారి దెబ్బతినడంతో శివ భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి శివ భక్తులు మాట్లాడుతూ మార్గమధ్యంలో రహదారి సరిగా లేక సుమారు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పంచలింగాల గుడి వద్దకు చేరుకున్నామని పిల్లలు వృద్దులు ఇబ్బంది పడ్డారని అధికారులు తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని భక్తులు తెలిపారు సిఐ బాబు మాట్లాడుతూ మార్గమధ్యంలో కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా దెబ్బతిని భక్తులు ఇబ్బంది పడ్డారని ఎండోమెంట్ సిబ్బంది తగు చర్యలు తీసుకొని దెబ్బతిన్న రహదారిని మరమ్మతులు చేయాలని తెలిపారు

2,809 Views

You may also like

Leave a Comment