Home ఎంటర్‌టెయిన్మెంట్ ఆస్కార్ అవార్డ్స్ లో గ్యాంబ్లింగ్.. తెలుగువారు మిమ్మల్ని ఆదరించారని మర్చిపోకండి – VRM MEDIA

ఆస్కార్ అవార్డ్స్ లో గ్యాంబ్లింగ్.. తెలుగువారు మిమ్మల్ని ఆదరించారని మర్చిపోకండి – VRM MEDIA

by VRM Media
0 comments
ఆస్కార్ అవార్డ్స్ లో గ్యాంబ్లింగ్.. తెలుగువారు మిమ్మల్ని ఆదరించారని మర్చిపోకండి



-పరేష్ రావెల్ సంచలన వ్యాఖ్యలు
-ఆస్కార్ అవార్డ్స్ లో లాబీయింగ్
-తెలుగు వారికి అభిమాన నటుడు

భారతీయ సినీ రంగంలోని లెజండ్రీ నటుల ప్రస్తావనకి వచ్చినప్పుడు అందులో ‘పరేష్ రావెల్'(పరేష్ రావల్)పేరు ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు చిత్ర ప్రేమికులకి కూడా సుదీర్ఘ కాలం నుంచి పరిచయమే. ముఖ్యంగా మనీ, గోవిందా గోవిందా, శంకర దాదా ఎంబిబిఎస్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిపోయాడు. కొంత కాలం గ్యాప్ తర్వాత రీసెంట్ గా రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ల ‘థామ'(తమ్మ)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటాడు.

రీసెంట్ గా పరేష్ రావెల్ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇచ్చే అవార్డుల గురించి మాట్లాడటం నా వరకైతే అవార్డ్స్ కంటే ప్రేక్షకులు, నిర్మాత, దర్శకుడు ఇచ్చే ప్రశంసలు ముఖ్యమైనవి. ఎందుకంటే అవార్డ్స్ విషయంలో లాబీయింగ్ జరిగే అవకాశం ఉంది. ఇతర పురస్కారాలతో జాతీయ అవార్డుల విషయంలో లాబీయింగ్ ఎక్కువ. ఆస్కార్ అవార్డ్స్ లో కూడా అలా జరిగే అవకాశం ఉంది. చిత్ర బృందం, నెట్ వర్క్, కొన్ని పార్టీల ద్వారా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. నిర్మాతలు జ్యురి సభ్యులను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఇది పలానా దర్శకుడు సినిమా అని ఒక్కోసారి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. పరేష్ రావెల్ లాంటి లెజండ్రీ యాక్టర్ అవార్డ్స్ గురించి ఆ రకంగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: వాళ్ళ పేర్లు చెబితే నన్ను చంపేస్తారు. రష్మిక వ్యాఖ్యలు వైరల్!

1985లో సన్నీడియోల్ హీరోగా వచ్చిన ‘అర్జున్’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన పరేష్ రావెల్ తన కెరీర్‌లో మొత్తం 240 చిత్రాల వరకు నటించాడు. సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న తన కెరీర్‌లో ఎన్నో అవార్డ్స్ ని అందుకున్న పరేష్ రావెల్ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. 2014లో భారతీయ జనతా పార్టీ తరుపున గుజరాత్ లోని అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీగా గెలుపొందాడు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ వంటి పురస్కారాలను సైతం అందుకున్నారు.

2,805 Views

You may also like

Leave a Comment