Home ఎంటర్‌టెయిన్మెంట్ ప్రభాస్ ‘ఫౌజీ’ సర్ ప్రైజ్.. బిగ్ లీక్ ఇచ్చిన సుధీర్ బాబు! – VRM MEDIA

ప్రభాస్ ‘ఫౌజీ’ సర్ ప్రైజ్.. బిగ్ లీక్ ఇచ్చిన సుధీర్ బాబు! – VRM MEDIA

by VRM Media
0 comments
ప్రభాస్ 'ఫౌజీ' సర్ ప్రైజ్.. బిగ్ లీక్ ఇచ్చిన సుధీర్ బాబు!



నవంబర్ 7న జటాధర
తెలుగువన్ కి సుధీర్ బాబు ఇంటర్వ్యూ
ప్రభాస్ ‘ఫౌజీ’ గురించి బిగ్ అప్డేట్

హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు నాటి కథతో రూపొందించిన ఈ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనని తాజాగా ‘తెలుగువన్’కి ఇచ్చిన సుధీర్ బాబు క్లారిటీ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతేకాదు, ‘ఫౌజీ’ మూవీలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపేలా బిగ్ అప్‌డేట్ ని రివీల్ చేశారు.

సుధీర్ బాబు హీరోగా నటించిన ‘జటాధర’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగువన్ కి ఇచ్చిన.. ‘ఫౌజీ ఇంటర్వ్యూ’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుధీర్ బాబు. “ఫౌజీలో మా అబ్బాయి నటిస్తున్న వార్త నిజమే. ప్రోపర్ ఆడిషన్ కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేదాలు నేర్చుకున్నాడు. డైరెక్టర్ హను గారు మంత్రాలు నేర్చుకోవాలని ఒక లిస్టు ఇచ్చారు. ప్రత్యేకంగా ఓ పూజారిని పెట్టించి, వాటికి పర్ గా పలకడం నేర్పించడం జరిగింది. వేదాల గురించి ఏకధాటిగా మూడు నిమిషాలు మాట్లాడాలి. అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: ‘బాహుబలి: ది ఎపిక్’ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..!

‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా, సైనికుడిగా రెండు కోణాల్లో కనిపించారని గతంలో న్యూస్ వినిపించింది. తాజాగా సుధీర్ బాబు కామెంట్స్ ని బట్టి చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది. ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో సుధీర్ తనయుడు నటిస్తున్నాడు. ఆ పాత్ర కోసం మంత్రాలు నేర్చుకున్నాడంటే అది బ్రాహ్మణ పాత్ర అని అర్థం. ఈ లెక్కన బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ నటించడం నిజమేనని స్పష్టమవుతోంది.

2,806 Views

You may also like

Leave a Comment