
 
						
						

–వైరల్ గా మారిన రమ్య కృష్ణ పిక్ 
-రామ్ గోపాల్ వర్మ మళ్ళీ సత్తా చాటుతాడా!
-పోలీస్ స్టేషన్ మే భూత్ పై అంచనాలు
– తెలుగు, హిందీలో రిలీజ్
దర్శకుడు ‘రామ్ గో వర్మ'(రామ్ గోపాల్ వర్మ)కొంత విరామం తర్వాత ‘పోలీస్ స్టేషన్ మే భూత్'(పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్)అనే చిత్రంతో మెగా ఫోన్ తీసిన విషయం తెలిసిందే. సత్య ఫేమ్ మనోజ్ బాజ్ పాయ్, బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా వర్మ స్టైల్లోనే సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే వర్మ చెప్పిన తర్వాతే పోలీస్ స్టేషన్ మే భూత్ అనే మూవీ చిత్రీకరణ దశలో ఉందనే విషయం తెలిసింది. ఇటీవల రిలీజైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
   
స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ(రమ్యకృష్ణ)కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన క్యారెక్టర్‌లో కనిపించబోతుంది. ఈ కార్యక్రమం వర్మ ఎక్స్(X)వేదికగా అధికారకంగా తెలియచెయ్యడంతో పాటు రమ్యకృష్ణ లుక్ కి సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేసాడు. వీరి పిక్ లో స్లీవ్ లెస్ టాప్, బ్లూ జీన్స్ ధరించి ఉన్న రమ్యకృష్ణ ఒక కుర్చీలో కూర్చొని పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంది. నుదుటిన వరుసగా చుక్కల పచ్చబొట్టుని ధరించడంతో పాటు ముక్కు పుడక, కాటుక కళ్లు, మెడలో రుద్రాక్షలను పోలి ఉండే దండలతో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుంది.
ఎటువంటి క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడంలో రమ్యకృష్ణ అగ్రగణ్యురాలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రమ్యకృష్ణ నుంచి వచ్చిన ఒకే ఒక్క లుక్ తో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ పై అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: కర్మ ఎవర్ని వదలదు.. బడా హీరో సినిమాలపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు
ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం థియేటర్స్ లో ‘బాహుబలి ది ఎపిక్'(Baahubali The EPic)రన్ అవుతూ ఉంది. దీంతో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ ప్రదర్శించిన రాజసం గురించి అభిమానులతో పాటు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ నుంచి రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన రమ్యకృష్ణ పిక్ రావడం వైరల్ గా మారింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.