
వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ భక్తులకు భద్రత కరువుగిరిబాబు
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా
న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ నవంబర్ 3:–
బాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. గిరిబాబు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సోమవారం రాత్రి ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ఏకాదశి పురస్కరించుకొని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ధర్మకర్త పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు మీడియాకు తెలిపారని ఆయినా నిఘా కొరవడటంతో అమాయకులైన భక్తులు మృతి చెందారన్నారు. తిరుపతి సింహాచలం ఆలయాల వద్ద జరిగిన తొక్కసలాట.. భక్తులు మృతి మరవక మునిపే మరో ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అమాయకులైన భక్తులు ప్రాణాలు విడుస్తున్నారన్నారు. ఇవన్నీ నెరవేసినటువంటి ముఖ్యమంత్రి ఈ ఘటనకు ప్రభుత్వ బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు ఒమ్మి రఘురాం, గొల్లపల్లి సురేష్, గొల్లపల్లి కాశి, గుమ్ములూరి వెంకటరమణ, ఇజనగిరి ప్రసాద్, బీశెట్టి అప్పలరాజు, అల్లం ఆదినారాయణ, పసల నాగేశ్వరరావు, బులిపే దేవి తదితరులు పాల్గొన్నారు.