Home ఆంధ్రప్రదేశ్ ఆలయ అభివృద్ధి కొరకై 50, వేల విరాళం అందజేతనిరుపేదల కుటుంబాల్లో అతి కారి

ఆలయ అభివృద్ధి కొరకై 50, వేల విరాళం అందజేతనిరుపేదల కుటుంబాల్లో అతి కారి

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 6

నిరుపేదల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఒక భరోసా కల్పిస్తూ రాజంపేట నియోజకవర్గ స్థాయిలో బడుగు బలహీన నిరుపేదల కుటుంబాల నివాసులకుఒక మనోధైర్యం కల్పిస్తూ రాజంపేట పార్లమెంట్ సమన్వయ కర్త అతి కారి కృష్ణ సేవా కార్యక్రమాలపై ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మండలంలోని మాధవరం గ్రామం, ఎస్ కే ఆర్ నగర్ ఎస్సీ కాలనీలో గురువారం రాజంపేట జనసేన పార్లమెంట్ అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో సీతారాముల ఆలయ అభివృద్ధి కొరకై 50 వేలు విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ ఎంతోమంది ప్రజా ప్రతినిధులు పూటకో మాట రోజుకో మాట చెప్తూ ఉంటారు కానీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణ సేవలు మేము ఎప్పటికీ మరవలేని విషయమని నిరుపేదల కుటుంబాలకు, అండగా ఉండడమే కాకుండా మాకు ఒక ఆత్మ ధైర్యాన్ని భరోసా కల్పిస్తు మాకు చెప్పిన వాగ్దానం ప్రకారం ఆలయ అభివృద్ధికి సహాయ కార్యక్రమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని ఇటువంటి ప్రజా ప్రతినిధికి కూటమి ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలని తెలిపారు మన ఊరు స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాలకు, ఆయన చేసిన సేవలు చిరస్థాయిలో నిలిచిపోతాయని ఆలయ గోపురం నిర్మాణ పనులకు ఆర్థిక సహాయం అందించడం పట్ల ప్రజలు హర్ష వ్యక్తం చేశారని తెలిపారు పార్లమెంట్ వాణిజ్య అధికారిక ప్రతినిధి ఎన్నారై చంద్ర మాట్లాడుతూ సేవా కార్యక్రమాల కొరకై పార్లమెంట్ సమన్వయకర్త కృష్ణ ఆధ్వర్యంలో మేము ఎల్లవేళలా నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటున్నామని నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి యువ నేత శ్రీకాంత్, టిడిపి పార్లమెంట్ వాణిజ్య అధికారిక ప్రతినిధి ఎన్నారై చంద్ర, మన ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్, రవికుమార్, సింగల్ విండో మాజీ డైరెక్టర్ మురళి, ఎస్సీ కుటుంబాల నివాసులు పాల్గొన్నారు

2,826 Views

You may also like

Leave a Comment