Vrm Media ప్రతినిధి శ్రీనివాస్


-హలో కామ్రేడ్స్.. ఛలో ఖమ్మం
-త్యాగాల పునాదులపై నిర్మితమైనది సిపిఐ
-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు
ప్రజాపక్షం / బోనకల్ : డిసెంబరు 26న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మోటమర్రి సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హాలో కామ్రేడ్స్.. ఛలో ఖమ్మం అంటూ ఇంటింటి ప్రచారాన్ని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావుతో కలిసి ఆయన 3వ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందని అన్నారు. దోపిడికి పాల్పడుతున్న వర్గాలకు వ్యతిరేకంగా మార్క్ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఎన్నో విజయాలు సాధించదని తెలిపారు. వేలాది మంది త్యాగాలతో ఈ విజయాలు సాధ్యమైనవని అన్నారు. ఈ వంద సంవత్సరాల ఉద్యమాలను, పోరాటాలను, విజయాలను ప్రజలకు వివరిస్తూ మరింత పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. మోటమర్రి గ్రామంలో అమరులు మరీదు హాన్మంతు, వంగాల బసవయ్య, మరీదు నరసింహరావు సిపిఐ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. అమరుల ఆశయ సాధనలోనే నేటికి సిపిఐ సభ్యులు, నాయకులు నడుస్తున్నారన్నారు. వండేళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, పోరాటాలు, ప్రజల పక్షాన సాధించిన విజయాలను నేటి తరాలకు తెలియజేస్తూ శతాబ్ది ఉత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి బుర్రి నాగేశ్వరరావు, కార్యదర్శి వంగాల కృష్ణ, వంగాల బ్రహ్మం, వంగాల నరేంద్ర, సహాకార మాజీ వైస్ ప్రసిడెంట్ గుడిద వెంకటేశ్వర్లు, వంగాల నాగేశ్వరావు, గీత పనివారుల సంఘం అధ్యక్షులు మరీదు మల్లయ్య, వంగాల నారాయణ, మరీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.