

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం. మీడియా
న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ నవంబర్ 7:–
వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్తిపాడు అఖిల్ విద్యా సంస్థలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్, కళాశాల విద్యార్థులు సమిష్టిగా “వందేమాతరం” గేయాన్ని ఆలపించి దేశభక్తి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఇనకోటి గంగాధర్ మాట్లాడుతూ, వందేమాతరం గేయం భారతీయుల హృదయాల్లో దేశభక్తి భావాన్ని నింపిందని, ప్రతి విద్యార్థి సమర్థవంతమైన పౌరునిగా ఎదిగి దేశ సేవలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఇనకోటి సునీత, స్కూల్ ఇంచార్జ్ నాగశ్రీ, కళాశాల ప్రిన్సిపాల్ పిడుగు హరికృష్ణ, ఏవో కాశీనాథ్, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.