
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా
న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 7:–
ప్రముఖ వ్యాపారవేత్త చలమలశెట్టి సునీల్ తండ్రి డాక్టర్ చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి చెందడంతో మచిలీపట్నంలో గురువారం చలమలశెట్టి సునీల్ ను మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. సునీల్ తండ్రి డాక్టర్ చలమల శెట్టి సురేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దాడిశెట్టి రాజా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో వైద్యుడిగా ఆయన సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు పవిత్ర శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird