సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 10
శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలివచ్చారు సిద్ధవటం మండలంలోని భాకరాపేట గ్రామంలో వెలిసిన భవాని శంకర శివాలయంలో కార్తిక మూడవ సోమవారం సందర్భంగా శివపార్వతుల ఉత్సవమూర్తుల మూల విరాట్ విగ్రహాలకు కళ్యాణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు స్వామి మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవం సందర్భంగా గణపతి పూజ పుణ్యాహవాచనం,, కంకణ ధార, జిలకర బెల్లం, మాంగల్య ధారణ, మంగళహారతి వంటి పూజా కార్యక్రమాలు జరిపి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు మరియు గ్రామ ప్రజలు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పాల్గొన్నారు