
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 10
పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసిన ఎస్సై మహమ్మద్ రఫీ
లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజేశ్వరుని కోనకు శివ భక్తులు పోటెత్తారు మండలంలోని వంతాటిపల్లి గ్రామం లోని శ్రీ నిత్య పూజేశ్వరుని కోనకు కార్తీక 3 వ సోమవారం సందర్భంగా శివపార్వతులకు, మహాగణపతి పూజ, రుద్రాభిషేకం కుంకుమార్చన మహా నివేదన, మంగళహారతి తీర్థ ప్రసాదాలు వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తుల విగ్రహాలకు కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవం సందర్భంగా కంకణదార, జిలకర బెల్లం, మాంగల్య ధారణ బ్రహ్మ ముళ్ళు, కార్యక్రమాల అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశామని సిద్ధవటం గ్రామ నివాసులు బాలు గారి, వెంకటరత్నం, ధర్మపత్ని వాసవి, మరియు వారి కుటుంబీకులు కళ్యాణ మహోత్సవం జరిపించారని తెలిపారు ఇంచార్జ్ ఎండోమెంట్ ఈవో శ్రీధర్ మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి భక్తులు దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని భక్తులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేశామని సన్నిధానంలో భక్తులకు స్వామి దర్శనం కల్పించే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు సిద్ధవటం మండల ఎస్సై మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేంద్రప్రసాద్, సిబ్బంది, చంద్ర, శివ భక్తులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird