Home ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ని ఘనంగా సన్మానించిన మాచుపల్లి టిడిపి నాయకులు

స్టేట్ డైరెక్టర్ ని ఘనంగా సన్మానించిన మాచుపల్లి టిడిపి నాయకులు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 11

సిద్ధవటం మండలం మాధవరం వన్ గ్రామంలోని స్టేట్ నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు స్వగృహంలో ఆయనను మండలంలోని మాచుపల్లి గ్రామ టిడిపి నాయకులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనివార్య కారణాలవల్ల తాడేపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకారంనకు హాజరు కాలేకపోయామని, మన మండల టిడిపి నాయకునికి స్టేట్ డైరెక్టర్ పదవి రావడం గర్వకారణం అని వారికి ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గం ఇంచార్జ్ జగన్మోహన్ రాజు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ఇదే విధంగా డాక్టర్ నాగూరు వీరభద్రుడు రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా ప్రజలకు మరెంతో విధంగా సేవలందించాలని వారు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దవటం మండల ఎక్స్ ఎంపీపీ నరసింహారెడ్డి మాచుపల్లి సర్పంచ్ ప్రతినిధి భాస్కర్ రెడ్డి బూత్ కన్వీనర్ శేఖర్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు పిచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2,836 Views

You may also like

Leave a Comment