
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 12
స్థానిక ప్రభుత్వ సంస్థల పనితీరిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ టి సునీత తెలిపారు
మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హై స్కూల్ లో బుధవారం జరిగిన ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హెడ్మాస్టర్ టి సునీత మాట్లాడుతూ గ్రామపంచాయతీలు దేశానికి పట్టుకొమ్మలని వాటి నిర్మాణం విధుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవడం తప్పనిసరి అని ప్రతి గ్రామంలో పారిశుధ్యం నీటి సరఫరా 15వ ఆర్థిక సంస్థల నిధులు జనన మరణ , ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు మొదలైన వాటిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల పనితీరు మెరుగు పరచడానికి విద్యార్థుల ఆలోచన కూడా ఉపయోగపడతాయని ప్రజల భాగస్వామ్యం సాంకేతిక వినియోగం పారదర్శకత అనే అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు అక్టోబర్ మాసంలో జరిగిన, స్థానిక ప్రభుత్వ సమస్యల పరిధిలో అనే అంశం ఇచ్చిన ప్రాజెక్టు వర్క్ ను విద్యార్థులు సమర్పించడం సమర్పించడం జరిగింది అని ఉన్నతమైన నాణ్యమైన ప్రాజెక్టులకు బహుమతులు అందజేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు