

వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరి బాబు
ప్రత్తిపాడు Vrm.media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 12:–
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరి బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ప్రత్తిపాడులో వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రజా ఉద్యమం చేపట్టాయి. నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో నలుమూలల నుండి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ర్యాలీ కొనసాగింది. స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన ర్యాలీ అల్లూరి జంక్షన్లో బయటయించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బైఠాయింపు వల్ల ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులకు దారా దత్తం చేసిందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణనుమెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపుదల చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని గిరిబాబు అన్నారు. చంద్రబాబు పాలనంత అప్పులతో పరిపాలిస్తున్నారని ఆరు నెలల్లో 60 వేల కోట్లు అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం తప్ప ఎక్కడ అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, జడ్పిటిసిలు బెహరా రాజరాజేశ్వరి, గొల్లు దివానం, ఎంపీపీ గోళ్ళ క్రాంతి సుధాకర్, బెహరా దొరబాబు, ఒమ్మి రఘురాం, రామిశెట్టి నాని, గుడాల వెంకటరత్నం, బదిరెడ్డి గోవింద్, సుంకర రాంబాబు, దలే చిట్టీబాబు తదితరులు పాల్గొన్నారు.