[ad_1]
హైదరాబాద్, నవంబర్ 12 (ఈవార్తలు): తెలంగాణ సెక్రటేట్లో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. చాలా కాలంగా ఒకే డిపార్టుమెంట్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగించింది. మొత్తం 134 మంది అధికారులను బుధవారం బదిలీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణల్లో భాగంగా భారీ స్థాయిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు 12 ఏళ్లుగా ఒకే పర్యవేక్షణలో ఉంటారు. కొన్ని శాఖల్లో అధికారులు కొరత ఉండగా, శాఖల్లో అధిక సిబ్బంది ఉన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది. ఈ బదిలీలు సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిభారాన్ని భర్తీ చేయడానికి కూడా దోహదపడనున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird