


సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 13
సిద్ధవటం మండలం 18 పంచాయతీ గ్రామాలు పరిశుభ్రంగా పెట్టుకునేందుకు రెండు రోజులపాటుశిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మండల కేంద్రమైన సిద్ధవటం ఎంపీడీవో సబా భవనంలో గురువారం ఎంపీడీవో ఫణి రాజకుమారి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు పరిశుభ్రత, పచ్చదనంతో ఉండేందుకు ఉన్నతాధికారి ఆదేశాలతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని గ్రామాలుపరిశుభ్రంగా పెట్టుకునేందుకు ప్రజలకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోఅవగాహన కల్పించాలని గృహాల నుండి రోడ్లపైకి మురుగునీరు, వెయ్యకుండా తెలపాలని దానివల్ల గ్రామం నందు అపరిశుభ్రత ఏర్పడి సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు, పబ్లిక్ ట్యాప్ వద్ద, అవసరం ఉన్నవరకే త్రాగునీరు పట్టుకుని మంచినీరు వృధా పట్టుకొని త్రాగునీరు వృధా కాకుండా చూసుకోవాలని ఆమె సూచించారు గ్రామాలు పరిశుభ్రత పచ్చదనంతో ఉండాలంటే ప్రజల ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి మెహతాబ్ యాస్మిన్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గురు ప్రసాద్, పి ఆర్ ఏ ఈ, నాగరాజు, ఏపిఎం, సుజాత ఉపాధి హామీ ఎపిఓ నరసింహులు పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు పాల్గొన్నారు