
ప్రత్తిపాడు Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్:–
ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు, టి. రాయవరం, ఒమ్మంగి గ్రామాల్లో వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరి బాబు పర్యటించారు. ఇటీవల కాలంలో మరణించిన కుటుంబాలను గిరి బాబు పరామర్శించి ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఉంటానని హామీ ఇచ్చారు. గిరిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామిశెట్టి నాని, మదినే నూకరాజు, దాడిశెట్టి నూకపతి, గుడాల వెంకటరత్నం, బత్తుల నాగార్జున,శేరు కృష్ణ, కొండి శ్రీను, కొప్పన గంగారావు తదితరులు పాల్గొన్నారు.