
వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
ప్రత్తిపాడు Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 14:–
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ముద్రగడ గిరిబాబు అన్నారు. కత్తిపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో కత్తిపూడి గ్రామం నుండి 2000 సంతకాలు పూర్తి చేసి మాజీమంత్రి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబుకు అందజేశారు. గిరిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొట్టమొదటగా కత్తిపూడి గ్రామం నుండి 2000 సంతకాల పూర్తి చేసిన నాయకులకు కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కోటి సంతకాల కార్యక్రమంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.కత్తిపూడి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు అడపా సోమేశ్, సప్పా రాంబాబు, చల్లా ప్రసాద్, పెయ్యల కృష్ణ, జీలకర్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird