
హైదరాబాద్‌లో ట్రెండ్ మారుస్తాం రోడ్‌లకు కంపెనీల పేర్లు పెడతాం భాగ్యనగరం పెట్టుబడులకు గమ్యస్థాన సౌకర్యాలు, భద్రతకు మాది హామీ యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌లో సీఎం రేవంత్ న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబర్ 13 (ఈవార్తలు): హైదరాబాద్‌లో రోడ్లకు నాయకుల పేర్లకు బదులు, కంపెనీల పేర్లు పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. మూస ధోరణికి స్వస్తి పలికి, కొత్త ట్రెండ్‌ను ప్రవేశపెడతామని చెప్పారు. ముఖ్యమైన రోడ్‌లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లు పెడతామని తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన అమెరికా – భారత దేశం వ్యూహాత్మక భాగ స్వామ్య సదస్సులో (యూఎస్‌ఐఐఎస్‌పీఎఫ్) సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్యస్థాన మని. అంతర్జాతీయ స్థాయి ప్రాథమిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో హైదరాబాద్ నగరం ఉందని చెప్పారు. అందువల్లే ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్యస్థానమ’ని వివరించారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంత వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కుండబద్ధలు కొట్టారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని వివరించారు. భారత దేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని తెలిపారు. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరుతూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను పడమే తన ప్రథమ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సదస్సులో వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే నూతన నగరంగా మారుతుందని