Home ఆంధ్రప్రదేశ్ కీటక జనతా వ్యాధులు చేతుల పరిశుభ్రత పై అవగాహన

కీటక జనతా వ్యాధులు చేతుల పరిశుభ్రత పై అవగాహన

by VRM Media
0 comments

ఒంటిమిట్టVRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి నవంబర్ 14

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాచపల్లి సచివాలయం లొ గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల గురించి మరియు చేతుల పరిశుభ్రత, క్యాన్సర్ గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. క్యాన్సర్ రాకుండా గుట్కా, పాన్ పరాగ్, బీడీ,చుట్ట, సిగరెట్, తంబాకు వీటన్నిటికి ప్రజలు దూరంగా ఉండాలని తెలియపరిచారు. ప్రతి కుటుంబం దోమతెరలో నిద్రించాలని, వేపాకు పొగ పెట్టుకోవాలని, దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదని తెలియపరిచారు. సూపర్ వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సచివాలయాల పరిధిలోని ప్రతి గ్రామంలో డ్రైడే ఫ్రైడే తప్పనిసరిగా పాటించాలని తెలియపరిచారు. సూపర్ వైజర్ లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతు ప్రతి సోమవారం 9 సచివాలయ పరిధిలోని గ్రామాలనందు అశుభ్రమైన ప్రాంతాలను గుర్తించి ఏపీ anm యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జమాల్ రెడ్డి గారు, ఉపాధ్యాయుల బృందం,cho అక్ష,anm లు నాగరాణి, శశికళ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

2,824 Views

You may also like

Leave a Comment