Home ఆంధ్రప్రదేశ్ చెత్త ఇవ్వండి సరుకులు తీసుకోండి.

చెత్త ఇవ్వండి సరుకులు తీసుకోండి.

by VRM Media
0 comments

శ్రీకాళహస్తి ట్రైనీ ప్రిన్సిపాల్. సరళ

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 14

ఒంటిమిట్ట మండలంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం నాడు తడి చెత్త పొడి చెత్త పై పొదుపు సంఘాలకు ఆనిమేటర్లకు
సిఆర్పి లకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి నుంచి ట్రైనీ ప్రిన్సిపాల్ సరళ పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ. చెత్త నుండి సంపద సృష్టించవచ్చని. చెత్త ఇవ్వండి సరుకులు తీసుకోండి అనే నినాదంతో డ్వాక్రా మహిళలు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని తెలిపారు అంతేకాకుండా. పారిశుద్ధ్యం పాటించాలని మన గృహాల మధ్య నీరు నిల్వ లేకుండా చేయాలని దోమ కాటువలన డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని తడి చెత్త బకెట్లలో పొడి చెత్త సంచుల్లో వేసుకొని ప్రభుత్వ చెత్త వాహనాలకు అందించాలని సరళ కోరారు. అంతేకాకుండా DLPO . విజయ్ భాస్కర్ మాట్లాడుతూ 21 తేదీనాడు ఒంటిమిట్ట పంచాయతీలో చెత్త సేకరణ కోసం ఇంటింటికి సీఆర్పీలు. డ్వాక్రా సంఘాలు వస్తారని అన్నారు. ఒంటిమిట్ట ఎంపీడీవో. జెట్టి సుజాతమ్మ మాట్లాడుతూ జిల్లాలో చెత్త సేకరణలో ఒంటిమిట్ట మండలం వెనుకబడి ఉందని జిల్లాలో 60 శాతం ఉన్న ఒంటిమిట్ట మండలంలో 50% లేకపోవడం బాధాకరమని అందరూ కలిసికట్టుగా 21 తారీకు చెత్త సేకరణలో జిల్లా స్థాయి మంచాలన్నారు. ఒంటిమిట్ట కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ఒంటిమిట్ట పంచాయతీలో ఈనెల 21న జరగబోయే తడి పొడి చెత్తలా సేకరించి ప్రజలకు వాటి బదులుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ విజయవంతం చేసే పనిలో డ్వాక్రా సంఘాల మహిళలు . సీఆర్పీలు. కదలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు. పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2,826 Views

You may also like

Leave a Comment