Home ఆంధ్రప్రదేశ్ గ్రామ దేవత స్థలాలను కాపాడాలని వినతిరాజంపేట తెదేపా ఇన్చార్జికి వినతి పత్రాన్ని అందిస్తున్న మాధవరం -1 ప్రజలు

గ్రామ దేవత స్థలాలను కాపాడాలని వినతిరాజంపేట తెదేపా ఇన్చార్జికి వినతి పత్రాన్ని అందిస్తున్న మాధవరం -1 ప్రజలు

by VRM Media
0 comments

సిద్దవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 14

మండలంలోని మాధవరం-1 పంచాయతీ ఎస్.కే.ఆర్ నగర్ గ్రామ శివారులో ఉన్న సర్వేనెంబర్ 1069/2 ఉన్న ప్రభుత్వ స్థలంలో గత 30 ఏళ్లుగా గ్రామ దేవతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ స్థలాలు అన్యాక్రాంతానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం రాజంపేట టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజంపేట తెదేపా ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకు మాధవరం-1 గ్రామ ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ముంపు గ్రామాల నుండి వలస వచ్చి దాదాపు 30 ఏళ్ల పైబడిందన్నారు.గ్రామ శివారులో ఉన్న సర్వేనెంబర్ 1069/2లో శీతల గంగమ్మ జాతర,శ్రీ మహాలక్ష్మి దేవి పొంగళ్ళు, శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి దసరా పార్వేట ఉత్సవం,తిరుణాల పుట్ట బంగారు కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవతలకు శీతల గంగమ్మ నిమజ్జనం,పార్వేట,పుట్ట బంగారు ఈ కార్యక్రమాలన్నీ ఆ స్థలంలోనే కొన్నేళ్ల నుంచి నిర్వహిస్తున్నామన్నారు. ఈ స్థలాలపై కన్నేసిన స్థానికులు కొందరు కబ్జా చేసేందుకు ఇటీవల యంత్రాలు పెట్టి చదును పనులు చేపట్టారన్నారు.వారిని అడ్డుకొని స్థలాన్ని కాపాడుకున్నామన్నారు. ఇలాంటి కబ్జాలు పునరావృతం కాకుండా తమ స్థలాలను గ్రామదేవతలకు కేటాయించేలా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని చమర్తిని కోరారు.ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి పార్లమెంట్ కార్యదర్శి అండ్లూరి నాగముని రెడ్డి,అవ్వారు రాజారాం,పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉక్కడాల శివ,జింకా శ్రీనివాసులు,జొన్నాదుల శ్రీనివాసులు,మాడా రామకృష్ణ, చేపూరి నరసింహులు,బిట్టా రాజేంద్ర పాల్గొన్నారు.

2,826 Views

You may also like

Leave a Comment