ఖమ్మం ఆదిత్య నగర్ 6వ డివిజన్లో చివర ఉన్న ఖాళీ ప్లాట్లలో అధికంగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా పాములు, పందులు సంచరించడం వల్ల స్థానికులకు తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సమస్యపై స్థానిక నివాసితులు VRM మీడియా ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మరియు ప్రాంతీయ కార్పొరేటర్ గారికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన అధికారులు JCB ను పంపించి గడ్డిని పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.




సమస్యను ప్రజల ముందుకు తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కారం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన VRM మీడియా, అలాగే స్పందించి చర్యలు తీసుకున్న కార్పొరేషన్ అధికారులు మరియు స్థానిక కార్పొరేటర్ గారికి ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird