Home ఆంధ్రప్రదేశ్ విద్యార్థిపై దాడి చేసిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి

విద్యార్థిపై దాడి చేసిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి

by VRM Media
0 comments


మండల విద్యాశాఖ అధికారికి వినతి

సిద్ధవటం, VRM న్యూస్ రిపోర్టర్
నవంబర్, 15

విద్యార్థిపై దాడి చేసిన ఎస్పీ బీవీడీ సభా హైస్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు
మాధవరం 1 గ్రామం లోని కృష్ణాపురంలో నివాసమున్న సునీత అనే మహిళ శనివారం మండల కేంద్రమైన సిద్ధవటం లోని ఎం ఆర్ సి కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి, 1 నాగరత్నకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెటాలియన్ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న సుశాంత్ అనే మా అబ్బాయి తోటి స్నేహితుల కోసం సరదాగా క్రికెట్ ఆడేందుకు సోమవారం హై స్కూల్ లోకి వెళ్లగా స్కూల్ కరస్పాండెంట్ మా అబ్బాయి పై దాడి చేశాడని అతనిపై తగు చర్యలు తీసుకోవాలనివినతి పత్రం సమర్పించామని గురువులు విద్యార్థులకు తల్లిదండ్రులతో సమానంగా ఉండాలి తప్ప విద్యార్థులపై దాడి చేయడం తగదని దాడిలో సుశాంత్ కు బలమైన గాయాలు తగలగా మెరుగైన వైద్య సేవ కోసం కడప రిమ్స్ తరలింపు చేశామని మండల విద్యాశాఖ అధికారి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు
మండల విద్యాశాఖ అధికారి నాగరత్న మాట్లాడుతూ ఇరువర్గాల నుండి ఫిర్యాదులు వచ్చాయని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నామని నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి,2 అరుణ తదితరులు పాల్గొన్నారు

2,831 Views

You may also like

Leave a Comment