Vrm Media శ్రీనివాస్ బోనకల్


బోనకల్: మండలంలోని రాయణ్నపేట గ్రామానికి చెందినసిపిఐ
సీనియర్ నాయకులు బొమ్మినేని హనుమంతరావు తనయులు, సిపిఐ సానుభూతి పరుడు, బొమ్మినేని రమేష్(44) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. శనివారం ఆయన మృతదేహానికి సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి లు పార్టీ పతాకాన్ని కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమేష్ స్థానిక ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసేవాడనీ కొనియాడారు. ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాడని అన్నారు . మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవి, సమితి సభ్యులు బత్తినేని నీరజ, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగప్రసాదరావు, కిలారి సురేష్, కాంగ్రెస్ మండల నాయకులు కళ్యాణపు నాగేశ్వరావు, చావా నాగేశ్వరరావు, బిఆర్ఎస్ నాయకులు జంగా రవి కుమార్, వల్లెబోయిన కొండలరావు, టీడీపీ బరకయ్య, తూము పుల్లయ్య, సిపిఐ నాయకులు ఏలూరి పూర్ణచంద్ర రావు, సీనియర్ నాయకులు వల్లెబోయిన జానయ్య, వల్లెబోయిన వీరభద్రం, తోటపల్లి ఆనందరావు, మరీదు వెంకటేశ్వర్లు, మరీదు ఈశ్వరమ్మ, ఏదుళ్ల సత్యం, మరీదు హాన్మంతరావు తదితరులున్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird