Home ఎంటర్‌టెయిన్మెంట్ నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే – VRM MEDIA

నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే – VRM MEDIA

by VRM Media
0 comments
నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే




దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
రాజు వెడ్స్ రాంబాయి ఎలా ఉండబోతుంది!
ఖమ్మం, వరంగల్ బోర్డర్ లో జరిగిన కథ

ఒక సినిమా అన్ని హంగుల్ని హద్దుకొని సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి ప్రధాన మూలస్థంభంగా నిలిచే వ్యక్తి దర్శకుడు. అటువంటి దర్శకులకి తమ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంటుంది. కానీ అంతిమ తీర్పు మాత్రం ప్రేక్షకులదే. కానీ ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు దర్శకులు విసురుతున్నారు.

ఈ నెల 21న ‘రాజు వెడ్స్ రాంబాయి'(Raju weds rambai)అనే మూవీ రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో అఖిల్ రాజ్(AKhil Raj)తేజస్వి రావు(Tejaswi Rao)జంటగా నటించారు. సాయిలు కంపాటి(Saailu Kaampati)రచన దర్శకత్వం వహించాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతు నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్ధనగ్నంగా తిరుగుతాను అనే వైరల్ కామెంట్ చేసాడు. దీనితో సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే సినీ ప్రియులు సినిమా బాగుంటే ఖచ్చితంగా మంచి టాక్ తో రన్ అవుతుంది. బాగున్నసినిమాని కావాలని ఎవరైనా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఎవరు నమ్మరు. సినిమాకి అంత శక్తి ఉంది. అలాంటిది ఈ రకంగా బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఎందుకనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


కూడా చదవండి: ఎవరు ఎటు వైపు.. ఏం జరగబోతుంది!

మరి కొంత మంది వ్యక్తులు ఒక వేళ సినిమా బాగోక నెగిటివ్ టాక్ వస్తే నిజంగానే అమీర్ పేట లో తిరుగుతాడా ఏంటనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సురేష్ బొబ్బిలి సంగీత సారధ్యంలో రాహుల్ మోపిదేవి నిర్మించగా, ఖమ్మం, బోర్డర్ కి సంబంధించి ఒక ఏరియాలో జరిగిన నిజజీవిత క్యారెక్టర్ల ఆధారంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రదర్శించబడింది.

2,824 Views

You may also like

Leave a Comment