Home వార్తలుఖమ్మం సిపిఎం మండల కమిటీ సభ్యుల మరియు శాఖ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం.

సిపిఎం మండల కమిటీ సభ్యుల మరియు శాఖ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం.

by VRM Media
0 comments

Vrm Media బోనకల్ ప్రతినిధి శ్రీనివాస్


సిపిఎం బోనకల్ మండల కమిటీ సభ్యుల మరియు శాఖ కార్యదర్శిల సమావేశాన్ని శుక్రవారం బోనకల్ మండల కేంద్రంలోని సిపిఎం ఆఫీసు నందు బోనకల్ మండల ఐద్వా కార్యదర్శి జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ఆహ్వానితులుగా పార్టీ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు , పార్టీ మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు హాజరయ్యారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి పొన్నం మాట్లాడుతూ ప్రపంచంలో పేదరికం లేని దేశంగా చైనాను ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, భారతదేశంలో కేరళ రాష్ట్రం అతి పేదరికం నుండి బయటపడిందని, ఇటు చైనా దేశం గాని, అటు కేరళ రాష్ట్రం గాని కమ్యూనిస్టు పాలకుల చేతిలో ఉండుటవలన ఈ విజయం సాధించగలిగారని, ప్రపంచంలోనీ ఇతర దేశాలు, మన దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చైనాను, కేరళ ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచం నుండి పేదరికాన్ని ప్రపంచం నుండి పారద్రోలాలని సూచించారు. పాతర్లపాడు లో జరిగిన సామినేని రామారావు హత్య దోషులను పోలీసులు వెంటనే పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోవాలని లేనిచో పోరాటాలను మరింత ఉదృతం చేస్తామనీ హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం జిల్లా మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, మండల కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, గుగులోతు నరేష్, చిట్టిమోదు నాగేశ్వరరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, నిమ్మల రామారావు, కూచిపూడి మురళి, సత్తు వీరబాబు, శాఖ కార్యదర్శులు ఉప్పర శ్రీను, బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీను, కొంగర భూషయ్య, మంద వీరభద్రం, మంద నాగరాజు, గుడ్డూరు వెంకట నరసయ్య, కోట కాటయ్య, మచ్చ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

2,814 Views

You may also like

Leave a Comment