Home వార్తలుఖమ్మం డ్వాక్రా రుణ వేధింపులతో మహిళల ఆవేదన

డ్వాక్రా రుణ వేధింపులతో మహిళల ఆవేదన

by VRM Media
0 comments

Vrm  media ప్రతినిధి శ్రీనివాస్ బోనకల్

భట్టి కాన్వాయ్‌ని ఆపి ఫిర్యాదు చేసిన గోవిందాపురం,ఆళ్లపాడు మహిళలు

10 లక్షల రుణానికి 15 లక్షలు వసూళ్లు చేస్తున్న అధికారులపై ఆగ్రహం

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డ్వాక్రా రుణాల పేరుతో జరుగుతున్న వేధింపులు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాయన్నపేట గ్రామానికి చేరుకోగానే ఆళ్లపాడు, గోవిందపురం గ్రామాలకు చెందిన మహిళలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలు సమసమూహంగా చేరి వినతిపత్రం అందజేశారు. “మాకు 10 లక్షల రుణం మంజూరు చేశారు… కానీ ఇప్పుడు 15 లక్షలు కట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నరన్నారు. వసూలు పేరుతో ఇంటి.. ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించారు. మా మీద అధిక వడ్డీలను బలవంతంగా మోపుతున్నారు” అని మహిళలు భట్టి విక్రమార్కకు తెలియజేసారు.

వాస్తవ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం చట్టవిరుద్ధం అని, దీనిపై వెంటనే విచారణ జరిపి, మహిళలను వేధిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మహిళల ఫిర్యాదును జాగ్రత్తగా విని, తక్షణమే అధికారులను పిలిచి నివేదిక

2,816 Views

You may also like

Leave a Comment