
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 23
సిద్దవటం మండలంలో
ప్రారంభించబోతున్న నూతన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయనతో పాటు సిద్దవటం టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ,
“మా పార్టీ సిద్ధాంతం సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు. ప్రతి పౌరుడి సమస్య పరిష్కారం కోసం ఈ కార్యాలయం ప్రజా వేదికగా నిలుస్తుంది. ఎల్లప్పుడూ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాంబశివ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, వార్డ్ మెంబర్ ఓబుల్ రెడ్డి, శంకర్, కొండవీటి సింహం, మణి, శ్రీనివాసులు, రాంప్రసాద్, నాగభూషణం, జడ్పీటీసీ చలమయాదవ్, జ్యోతి సుబ్బా రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణ రెడ్డి తదితర టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird