

. కట్ట రమణ.కట్ట జయదేవ్. కట్ట శేఖర్. జవ్వాజి మురళి ఆధ్వర్యంలో. గొప్ప అన్నదాన కార్యక్రమం
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 24
నవంబర్ 24 ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లి గ్రామంలో 70 సంవత్సరాల. భైరవ స్వామి ఆలయంలో తిరుణాల సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కట్ట వెంకటసుబ్బయ్య వారి ధర్మపత్ని వెంకటమ్మలకు సంతానం లేకపోవడంతో భైరవ స్వామిని భక్తిశ్రద్ధలతో విశిష్ట పూజలు చేయడంతో వారికి సంతానం కలిగినందువలన భైరవ స్వామికి గుడి కట్టించి విశిష్ట పూజలను ఇప్పటివరకు అందిస్తున్నారు. సోమవారం నాడు. విశిష్ట పూజలు. హోమాలు. అభిషేకాలు నిర్వహించారు. అంతేకాకుండా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు 70 సంవత్సరాల భైరవ స్వామి పురాతన విగ్రహానికి పెద్దకొత్తపల్లి ప్రజలు తండోపతండాలుగా వచ్చి కయా కర్పూరాల సమర్పించి భక్తిశ్రద్ధలతో భైరవ స్వామి కి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి ప్రజలు మరియు చిన్న కొత్తపల్లి గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird